Breaking News :
To download Sri Krishna Committee Report click here

Place : అమెరికా
Date : 2011-08-10
Date : 2011-08-10
అమెరికా ఆధిపత్యానికి తెరపడుతోంది. మాంద్యం ఫీవర్ తో బాధపడుతున్న అగ్రరాజ్యం ఆ ఉచ్చులోంచి ఎలా బయటపడాలని కాకుండా...పొరుగు దేశాలు తమ ఫస్ట్ ప్లేస్ ను తన్నుకుపోతాయోమేనని తెగ ఫీలయిపోతోంది. ఇందుకు ఒబామా చేస్తున్న కామెంట్సే నిదర్శనం...
భారత్ , చైనాలతో తమ దేశపు విద్యావ్యవస్థ పోటీపడలేకపోతోందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, చైనా , బ్రెజిల్ లకు చెందిన బాలలతో పోటీపడేలా అమెరికా చిన్నారులను తీర్చిదిద్దలేకపోతున్నట్టు ఆయన వాపోయారు. తమ దేశంలోని విద్యావ్యవస్థలో లోపాలను సరిదిద్ది వారికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని ఒబామా అమెరికా విద్యావేత్తలకు పిలుపునిచ్చారు.ఈ మాటలు వింటుంటే పెద్దన్న విద్యావ్యవస్థ చిత్తయిందా అన్న అనుమానం కలుగుతోంది.
మాంద్యం పైన కూడా ఒబామా తన మనసులో మాట చెప్పాడు. రిసెషన్ నుంచి రికవరీ అయ్యే ప్రక్రియ అంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. క్రెడిట్ రేటింగ్ తగ్గిన మాట వాస్తవమేనన్నారు. ఆర్థికాంశాల్లో చైనా , భారత్ , బ్రెజిల్ దేశాలు తమదేశానికి గట్టిపోటీనిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఎక్కువ మంది ఇంజనీర్లు, శాస్ర్తవేత్తలు ఆ దేశాల్లోనే తయారవుతున్నారని ...అమెరికా అప్రమత్తం కాకపోతే తమ కంపెనీల నుంచి ఆ దేశాలు ఆ మేరకు మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటాయని వివరిస్తున్నారు.
ఒబామా వ్యాఖ్యలు చూస్తుంటే...పొరుగు దేశాల్ని పొగుడుతున్నారో.. లేక ఆసియా దేశాలు డెవలప్ మెంట్ చూసి కుళ్లుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఒబామా చెప్పినదాంట్లో కొంత నిజం లేకపోలేదు. ప్రపంచశక్తిగా ఎదిగేందుకు చైనా ఆల్రెడీ రెడీ అయిపోయింది. అలాగే భారత్ , బ్రెజిల్ తమ ఆర్థికవ్యవస్థను పటిష్టం చేసుకునే పనిలో ఉన్నాయి. కాని యూఎస్ మాత్రం రోజురోజుకీ ప్రతిష్ట దిగజార్చుకుంటోంది.

Feedbacks :
No feedbacks