Breaking News :
To download Sri Krishna Committee Report click here

Place : ముంబాయి
Date : 2012-02-21
Date : 2012-02-21
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సమస్యలు మరింత ముదురుతున్నాయి. కొద్ది కాలంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సంస్థకు బ్యాంకు అకౌంట్లు జప్తు చేసి ఐటీ శాఖ మరో షాక్ ఇచ్చింది. మరోవైపు కష్టాల్లో ఉన్న సంస్థ ముందస్తు సమాచారం లేకుండా పలు సర్వీసులను రద్దు చేయటంతో... డీజీసీఏ భగ్గుమంది. మరోవైపు కింగ్ ఫిషర్ కు బెయిల్ అవుట్ ప్యాకేజ్ ఇచ్చే ప్రసక్తేలేదని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తేల్చిచెప్పడంతో... ఆ కంపెనీ భవితవ్యం గాల్లో దీపంగా మారింది.
కింగ్ ఫిషర్ కు కష్టాల మీద కష్టాలొస్తున్నాయి. అసలే నిధుల లేమి... ఆపై సంస్థను వీడుతున్న ఉద్యోగులు . . ఇవి చాలవన్నట్టు తాజాగా కంపెనీకి ఐటీ శాఖ మరోషాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేయడంతో కింగ్‌ఫిషర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఐటీ శాఖ అకౌంట్ల జప్తు దెబ్బతో కింగ్‌ఫిషర్ భారీ సంఖ్యలో విమాన సర్వీసులును రద్దు చేస్తోంది. మూడు రోజలుగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే దేశంలో ఆరు మెట్రో నగరాల్లో సర్వీసులు నిలిచిపోవడాన్ని సంస్థ ధృవీకరించింది. మళ్లీ ఈ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కింగ్ ఫిషర్ మూడు రోజులుగా ఇదే తంతుకొనసాగిస్తోంది. ఆదివారం ఢిల్లీ, కలకత్తా, ముంబైల నుంచి మొత్తం 27 విమానాలను రద్దు చేసిన సంస్థ సోమవారం కూడా సర్వీసుల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయింది. కింగ్‌ఫిషర్ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీనికి కింగ్‌ఫిషర్ ఇచ్చిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది. పక్షులు గుద్దుకోవడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోనే విమానాలు నిలిపివేసినట్టు చెప్పడంతో సంస్థ మనుగడపై అనుమానాలు మొదలవుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఈ సంస్థ సమస్య తీరేలా కనిపించడం లేదు. కింగ్ ఫిషర్‌కు బెయిల్ అవుట్ ఇచ్చే ప్రతిపాదన ఏది తమ వద్ద లేదంటూ... పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ తేల్చిచెప్పారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో సుమారు 70 శాతం నష్టాలను మూటగట్టుకున్న సంస్థ... ఇక కోలుకోవడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. కింగ్ ఫిషర్ కథ క్లైమాక్స్ వచ్చినట్టేనని.. ఇవాళో రేపో దివాళ తీయడం ఖాయమని చెప్తున్నారు.

Feedbacks :
No feedbacks