Breaking News :
To download Sri Krishna Committee Report click here

Place : బ్రిస్బేన్
Date : 2012-02-21
Date : 2012-02-21
ముక్కోణపు సిరీస్‌లో భారత్ మరో పరాజయం చవిచూసింది. ధోనీ గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన సెహ్వాగ్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు. ఒక్క కోహ్లీ మినహా మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో బ్రిస్బేన్ వన్డేలో శ్రీలంకతో భారత్‌కు 51 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 289 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ లక్ష్య ఛేదనలో విఫలమైంది. 45.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ 66, రైనా 32, గంభీర్ 29, టెండుల్కర్ 22 పరుగులు చేశారు. చివర్లో పఠాన్ 47 రన్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేశాడు. లంక బౌలర్లలో పెరీరా నాలుగు వికెట్లు తీయగా, కులశేఖర మూడు, మలింగ రెండు, మహరూఫ్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ ఓటమితో భారత్ మూడో స్థానానికి పడిపోయింది.
Feedbacks :
No feedbacks










