Breaking News :
To download Sri Krishna Committee Report click here
బంగారం కన్నా వేగంగా  వెండి ధరలు పుంజుకోనున్నాయి.
Place : హైదరాబాద్

Date : 2012-02-23
వెండి బంగారం కానుంది. తళ తళ లాడే వెండి భగ భగమని మండనుంది. బంగారం కన్నా వేగంగా  వెండి ధరలు పుంజుకోనున్నాయి. ఈ ఏడాది వెండిపై పెట్టుబడులు పెట్టనున్న ఇన్వెస్టర్లకు సిరుల పంట పండనుంది..
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న  అనిశ్చితి పరిస్థితులు.  ప్రీషియస్ మెటల్స్‌ ధరలకు రెక్కలు తొడగనున్నాయి.  దీంతో మరో సారి వెండి ధరలు త్వరలో ఆకాశాన్నంట నున్నాయి. చరిత్రలో ఇది వరకు లేని రికార్డు గరిష్ట స్థాయికి  చేరనున్నాయని  నిపుణులు అంటున్నారు. కొద్ది రోజులుగా  బంగారం ,వెండి ధరలు నిలకడగా ట్రేడవుతున్నాయి .రెండేళ్ల క్రితం 29 వేల వద్ద ఉన్న కిలో వెండి ధర  ఇప్పుడు రెట్టింపు స్థాయిలో ఉంది.   ప్రస్తుతం కిలో వెండి 58 వేలు  ఉండగా.. 10 గ్రా. బంగారం 28 వేలపైన ట్రేడవుతోంది. ఇప్పట్లో గ్లోబల్ రిసెషన్ కొలిక్కి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో... ఈ ఏడాది  వెండి ధర ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ను దాటుంతుందని బాంబే బులియన్  అసోషియన్ ప్రతినిధులు చెప్తున్నారు. బంగారం కూడా 35 వేల మార్క్‌ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా భవిష్యత్‌లో లాభాల కోసం బంగారాన్ని దాచుకోమని చెప్తుంటారు. కానీ  ప్రస్తుతం  ఈ ప్లేస్ వెండి దక్కించుకుంటోంది. కొనుక్కున్న వాళ్లకు కొన్నదానికి మించిన లాభాలను మోసుకురానుంది. దీంతో ఇన్నాళ్లు హవా కొనసాగించిన స్వర్ణం... ఇప్పుడు వెండి వెనుక నడవనుంది. మరోవైపు  పెరుగుతున్న ధరలతో మన దేశంలో ఈ ఏడాది వెండి దిగుమతులు తగ్గనున్నాయి. ఏదేమైనా  బంగారం, వెండి ఆభరణాల  ఉపయోగంలో అగ్రగామైన మన దేశంలో కోనుగోలుదారులు త్వరలో జ్యూవెలరీ షాపుల ముందు క్యూలు కట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఆలస్యం చేయకుండా మీరూ బయలు దేరండి.

Feedbacks :
No feedbacks
Add Feedback
Your Name : * ( or ) Anonymous User
Contact No :  
Email :  
Feedback : *